News

హిందూ ధర్మ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

288views

హిందూ సోదరులు తమను తామే రక్షించుకోవాలని, సెక్యులర్ పార్టీలను భూస్థాపితం చేయన్నన్నామని గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠం పీఠధిపతి కామాలంద భారతి స్వాములు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా, సోమందేపల్లె మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కమలానంద స్వామికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్బంగా శ్రీ కమలానంద భారతి స్వామి మాట్లాడుతూ దేశం లో ప్రతి చోట హిందువులపై దుష్ట శక్తులు, అసాంఘిక దెయ్యాలు దాడులు చేస్తున్నాయని. హైందవ ధర్మం పాటిస్తున్న హిందూ సోదరులకు రక్షణ కరువైందాన్నారు, మొన్న ఎంఐయం పార్టీ అసద్దుద్దీన్ ఒవైసీ దేశ ప్రధాని, ఆదిత్యనాథ్ యోగి పై అనుచిత వ్యాఖ్యలు చేసారని, అతని మీద ఎందుకు కేసులు పెట్టలేదని, ఎందుకు జైలుకు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా రాజకీయ నాయకులను, పార్టీలను చుస్తే తనకు కోపం వస్తుందని, వారంతా మనల్ని వాడుకుని వదిలేసేవారే అన్నారు. మన హిందూ సోదరుల శవాలమీద మరమరాలు, ప్యాలలు, శనగలు తినే బతకాలి వాళ్లంతా అన్నారు. ప్రతి హిందూ సోదరుడిని ఎవరు కాపాడరని, మనల్ని మనమే కాపాడుకోవాలి అని శ్రీ కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. హిందువులను కించపరిచిన, వారిపై దాడులు చేసినా వారి తాట తీస్తామని హెచ్చరించారు. హిందువుగా జన్మించి హిందువుగా గర్వించు గడపలోని కులం గడప దాటితే హిందువు 100 సంవత్సరాల నుండి హిందువులకు రక్షణగా హిందుత్వం పెంపొందిం చడంలో పరిరక్షించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంతో కీలకమన్నారు స్త్రీల సంరక్షణ గో సంరక్షణ హిందూ ధర్మ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు చేశారు వేలాది మందికి హిందు బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు మహిళలు విద్యార్థులు హిందూ బంధువులు అందరూ వేలాదిమంది పాల్గొన్నారు.