
ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని జీలం నది పరివాహక ప్రాంతంలో దుర్గాదేవి పురాతన విగ్రహం దొరికింది. దాన్ని శ్రీనగర్‌లోని పురావస్తు విభాగానికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే బారాముల్లాలోని షల్తాంగ్-జోగ్యార్ నివాసి నజీర్ అహ్మద్ లాటూ అనే జాలరి జీలం నదిలో చేపలు పడుతుండగా ఈ దుర్గామాత రాతి శిల్పం దొరికింది. వెంటనే అతను జమ్ముకశ్మీర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ శిల్పాన్ని గురించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు షెరి పోలీస్ స్టేషన్‌లో సురక్షితంగా ఉంచారు.
జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్కైవ్స్, ఆర్కియాలజీ,మ్యూజియంల డైరెక్టరేట్ అందిన ఆదేశాలను అనుసరించి, శిల్పాన్ని అధికారికంగా శ్రీనగర్‌లోని పురావస్తు విభాగానికి అప్పగించారు”. ఇటువంటి ఆవిష్కరణలు కాశ్మీర్ కి సంబంధించిన ప్రాచీన కథనాన్ని గురించి వెళ్లడిస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం ఎప్పడిది అనే విషయంపై పరిశీలన జరుగుతోంది. ఇప్పుడు ఈ శిల్పం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్, ఆర్కియాలజీ మరియు మ్యూజియంల శాఖ సంరక్షణలో ఉందని అధికారులు తెలిపారు.





