
అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన ఏడుగురు రోహింగ్యాలను కాచర్ జిల్లాలోని కటిగోరా ప్రాంతంలో అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. లకిచార ప్రాంతంలో స్థానికులు గుర్తించిన ఈ బృందంలో మహిళలు, పిల్లలతో కలిపి 11 మంది ఉన్నారు.. స్థానికులు ఈ వీరి అనుమానాస్పద కదలికలను గుర్తించి వారి గుర్తింపు గురించి ఆరా తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కానీ వారు వారి గుర్తింపును ఇవ్వలేదు దాంతో స్థానికులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గుర్మా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోహింగ్యాలను అదుపులోకి తీసుకుంది. ఈ బృందం గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివసిస్తుందని , అక్కడే ఒక ఫ్యాక్టరీ కార్మికులుగా పనిచేస్తోందని విచారణలో భాగంగా కాచర్ పోలీసు వర్గాలు తెలిపాయి. వారు 2020లో భారతదేశంలోకి ప్రవేశించి స్థానిక అధికారి సహాయంతో నకిలీ ఇండియన్ ఐడీలను పొందారని పోలీసుల విచారణలో తేలింది.
ప్రభుత్వం ఇటీవల చొరబాటుదారులపై చేపట్టిన చర్యలను చూసి తాము హైదరాబాద్ నుండి పారిపోయామని అరెస్టయిన రోహింగ్యా గ్రూపు అంగీకరించింది. వారు కాచర్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని అనుకున్నారు. రోహింగ్యాలను బంగ్లాదేశ్‌కు తిరిగి పంపడానికి BSFకి అప్పగించనున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇటీవల అస్సాం నుండి ఇప్పటివరకు 3300 మందికి పైగా అక్రమ చొరబాటుదారులను బహిష్కరించారు.





