News

స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

293views

స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి సెప్టెంబర్ 20, 21, 2025 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ సిఎ ఆర్ సుందరం, జాతీయ సహ సంఘటన కార్యదర్శి శ్రీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

నేడు భారత్ అంతర్గతంగా, బాహ్యంగా ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, స్వీయ విధానాల ద్వారా భారత్ జీఎస్టీని రెండు స్లాబులుగా సరళతరం చేసింది. ద్రవ్యోల్బణం , బ్యాంకు వడ్డీ రేట్లు నియంత్రణలో ఉండగా, నిరుద్యోగం అత్యల్ప స్థాయిలో ఉంది. ఆగస్టు త్రైమాసికంలో 6–8 శాతం వృద్ధి, 10 శాతం వినియోగదారుల డిమాండ్ పెరుగుదల ద్వారా కఠినమైన ప్రపంచ పరిస్థితుల మధ్య కూడా భారత్ నిరంతరంగా ఎదుగుతున్నదని స్పష్టమవుతోంది అని ఈ సమావేశంలో మీడియాతో చెప్పారు.

అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితి అనిశ్చితితో నిండి ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–గాజా ఘర్షణ, చైనా తక్కువ ధరలతో ఉత్పత్తులను డంప్ చేయడం, అమెరికా భారతదేశం సహా ఇతర దేశాలపై సుంకాలు విధించడం వల్ల ఆర్థిక, సామాజిక జీవనం ఒత్తిడిలో ఉందనీ. వాణిజ్య సుంకాలను నియంత్రించడంలో WTO నిష్క్రియగా, ప్రభావం లేనిదిగా మారింది. అమెరికా భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకంతో పాటు, రష్యన్ ఆయిల్ దిగుమతుల పేరుతో మరో 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. ఇది న్యాయం కానిది, సహించలేనిది అని చెప్పారు. దానివల్ల, అమెరికాకు భారత ఎగుమతులలో 86 బిలియన్ డాలర్లలో దాదాపు 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు కష్టాల్లో పడుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి, భారత ప్రభుత్వం 40 దేశాల్లో కొత్త ఎగుమతి అవకాశాలను అన్వేషించింది. అంతేకాక, వినియోగదారుల డిమాండ్ , ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది.

జీఎస్టీ సరళీకరణతో పాటు, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎస్‌జెఎమ్ పిలుపునిచ్చిన “స్వదేశీ వాడకం – వోకల్ ఫర్ లోకల్” భావజాలానికి మద్దతుగా నిలిచారు. స్వదేశీ–స్వావలంబన ఉద్యమం పట్ల ప్రధాన మంత్రి భారత ప్రభుత్వ కట్టుబాట్లను ఎస్‌జెఎమ్ హృదయపూర్వకంగా అభినందిస్తోంది అని వారన్నారు. దేశీయ, అంతర్జాతీయ సమస్యలను సమీక్షిస్తూ, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల సమన్వయంతో స్వదేశీ–స్వావలంబన అభియాన్ (SBA) ను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర కార్యవర్గం ప్రకటించింది.
ఈ అభియాన్‌లో భాగంగా రైతు సంఘాలు, వినియోగదారుల సంఘాలు, వ్యాపారి సంఘాలు, ఉపాధి సంఘాలను స్వదేశీ ఉత్పత్తులను నిత్యజీవితంలో ముందుకు తేవడానికి ఆహ్వానిస్తారు. 200 కన్నా ఎక్కువ స్వదేశీ మేళాలను నిర్వహించనున్నారు. అంతేకాకుండా అందికీ స్వదేశీ మీద అవగాహన తీసుకురావడానికి స్వదేశీ సంకల్ప ర్యాలీలను నిర్వహించనున్నారు. స్వదేశీ–విదేశీ వస్తుల మధ్య తేడాను గుర్తించడానికి స్వదేశీ ఉత్పత్తుల పత్రికలను పంచడం వల్ల ప్రజల్లో అవగాహన పెంచడంతో వంటివి చేయనున్నారు.

స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా భారత్‌ను త్వరలోనే పూర్తి ఉపాధి కలిగిన, సమృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాలని, అందుగని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ స్వదేశీ జాగరణ్ మహాభియాన్ లో పాల్గొనాలని, స్వదేశీ జాగరణ మంచ్ ఈ సందర్భంగా కోరుకుంది.

ఈ కార్యక్రమంలో జాతీయ సంఘటన కార్యదర్శి శ్రీ కాశ్మీరీ లాల్, జాతీయ కో-కన్వీనర్ ప్రొ. ఆర్ మిట్టల్ , దక్షిణ క్షేత్ర కన్వీనర్ డా.ఎస్. లింగ మూర్తి , జాతీయ మహిళా ప్రముఖ్ శ్రీమతి అర్చనా మీనా , జాతీయ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ రాజీవ్, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ కేశవ్ సోని తదితరులు పాల్గొన్నారు.