News

571 ఏళ్లుగా.. ఒకే వేదికపై దుర్గాపూజ

258views

పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా కోన్‌నగర్‌కు చెందిన ఘోషాల్‌ జమీందార్ల కుటుంబం 571 ఏళ్లుగా ఒకే ప్రాంగణంలో దుర్గాపూజ నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 1454లో దిల్లీ సుల్తానుల కాలంలో ఘోషాల్‌ కుటుంబం జమీందారీ హక్కులు పొందింది. అప్పటి నుంచీ తమ ఇంటి ప్రాంగణంలో ‘‘దుర్గాపూజ’’ నిర్వహిస్తోంది. అయితే ఈ పూజ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు. సామాజిక సందేశాన్నిచ్చే కార్యక్రమం నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఈసారి బెంగాలీ భాష పట్ల గౌరవం, గుర్తింపు అనే అంశం ఇతివృత్తంగా ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నట్లు ఘోషాల్‌ కుటుంబానికి చెందిన అశుతోస్‌ ఘోషాల్‌ తెలిపారు.