News

కాశీ నుంచి కేదార్‌నాథ్‌.. చెప్పుల్లేకుండా యువకుడి సైకిల్‌ యాత్ర

255views

ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో అజయ్‌ కుమార్‌ పటేల్‌ అనే యువకుడు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. అదీ చెప్పుల్లేకుండానే. కాశీ విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమైన అతడి యాత్ర ఇప్పటికే 11 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 11 జ్యోతిర్లింగాలు, ఇతర పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణం సాగించిన అతడు ఇప్పుడు దిల్లీ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరాడు. ఒకవైపు సనాతన సంస్కృతిని చాటుతూ.. మరోవైపు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ యాత్రామార్గంలో కలిసిన వారికి అవగాహన కల్పిస్తున్నాడు.

ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతాల్లో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ.. అనేక మంది గుర్తుతెలియని వ్యక్తులు తనను ఆదుకున్నారని గుర్తుచేసుకున్నాడు. ఓ దుకాణదారుడు రూ.2 వేల ఖర్చులు మాఫీ చేశారని తెలిపాడు. దేవుడి అనుగ్రహంతోపాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ముందుకెళ్తున్నట్లు చెప్పాడు. తన ప్రయాణంలో భక్తి, సాంస్కృతిక ఐక్యత, పర్యావరణ స్పృహను చాటుతున్నాడు.