
కార్మిక ప్రభుత్వ బీమా సంస్థ -ఈఎస్‌ఐ ఆసుపత్రులలో కార్మికులకు, వారి కుటుంబాలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ క్షేత్ర సంఘటన మంత్రి ఈఎస్‌ఐ బోర్డు సభ్యులు శ్రీ దురై రాజు గారు తెలిపారు. విజయవాడలో ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈఎస్‌ఐ కవరేజ్ ఉన్న కార్మికులకు ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అధికారులకు సూచించారు. కార్మికులకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అలాగే కొండపల్లిలోని ఈఎస్‌ఐ వైద్య చికిత్సా కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ వైద్య సేవలో కార్మికులకు ఎదురైతున్న సమస్యలు, ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ ప్రాధాన్యమివ్వాలని దురై రాజు ఈ సందర్బంగా సూచించారు.





