
196views
ఆధ్యాత్మిక చింతన.. సాంస్కృతిక చైతన్యం మేళవించిన మహత్తర కార్యక్రమమే విజయవాడ ఉత్సవ్.. ఈ వేడుకతో దేశం మొత్తం బెజవాడ వైపు చూస్తుంది’ అని మంత్రులు సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో దసరా సందర్భంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌పై స్థానిక ఓ హోటల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ..‘ఉత్సవ్.. లక్షల మందిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి అంతరించిపోతున్న కళా, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించే కార్యక్రమం. పార్టీలకు సంబంధించినది కాదు. కమిటీ ద్వారా నిర్వహిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ‘ఉత్సవ్‌లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలి.





