
నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసాన్ని , స్థానిక మున్సిపల్ కమీషనర్ శ్రీ శేషన్న , శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మినారాయణ, సూపర్ వైజర్ శ్రీ మురళి సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థుల క్రమశిక్షణ, ప్రదర్శనలను, ఆవాసం లోపల, బాహ్య పరిసరాలను పరిశీలించి, ఆవాస నిర్వహణ తీరు, పరిశుభ్రత వంటి అంశాలని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.

సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాస్, ఆవాస దైనందినిని, విద్యార్థుల ప్రగతిని, సంఘమిత్ర చేబడుతున్న అభ్యాసికలు, చెంచుగూడేల దత్తత, వైద్య సేవలు, దుస్తుల వితరణ, స్వచ్చ భారత్, సేవా బస్తీల్లో వైద్య శిబిరాలు, గ్రామీణ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ లాంటి సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు.
సంఘమిత్ర సేవా కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్త పరచిన మున్సిపల్ కమీషనర్ తమ వైపునుండి ఎలాంటి సహాయం అవసరమైనా చేయటానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ జే. వెంకటేశ్వర్లు, శ్రీ మహేశ్వర రెడ్డి, కోశాధికారి శ్రీ సముద్రాల నాగ రాజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వెంకటేశ్వరి, శ్రీ రామాంజనేయులు, సంఘమిత్ర ఆవాస్ ప్రముఖ్ శ్రీ గంగాధర్ చిన్నారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.





