News

పహల్గాం మృతుల కుటుంబాలకు శృంగేరి పీఠం ఆర్థిక సహాయం

445views

కర్ణాటకలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేదిక- శృంగేరి శారదా పీఠం పహల్గాం ఘటనలో మరణించిన ఇద్దరు కన్నడిగులతో సహా మొత్తం 26 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని ప్రకటించింది. ఈ సహాయం కష్టకాలంలో హిందువులకు హిందువులే మద్దతుగా నిలబడాలనే ఉద్దేశంతో అందించబడుతుందని స్వామి విధుశేఖర భారతి పేర్కొన్నారు.

అద్వైత తత్వశాస్త్ర స్థాపకుడు ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో మొదటి ప్రదేశం శృంగేరి. శృంగేరిలో విద్య మరియు జ్ఞాన దేవత శారదాంబకు అంకితం చేయబడిన శారదాంబ ఆలయం ఉంది.