
334views
కర్నూలులో హెచ్ డి సి టి, సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యసేవా కేంద్రంలో ఎక్సరే, రక్తపరీక్ష సేవలు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యాలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎక్సరే, రక్తపరీక్షా కేంద్రాన్ని సేవా భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎస్ఎస్ నగర సంఘ్ చాలక్ డాక్టర్ వాసురెడ్డి, డాక్టర్ అనంత్ తదితరులు ప్రారంభించారు. ప్రధాన వక్తగా సేవా భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగం శ్రీనివాసులు పాల్గొన్నారు.




