
పల్నాడు జిల్లాకేంద్రమైన నరసరావుపేటలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా ఆఫీసులో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమలకుమారి ప్రకృతి వ్యవసాయంపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఆరు సబ్ డివిజన్ లో ఆయా గ్రామాల్లో 2025 ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతును పి జి ఎస్ గ్రూపులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా రైతులు తాము పండించిన పంటలు మార్కెట్ ధర కన్నా 15 శాతం ఎక్కువ ధర లభిస్తుందని,అంతేకాకుండా ప్రతి రైతుకు మొదటి రెండు సంవత్సరాలు స్కోప్ సర్టిఫికెట్ ఇచ్చి మూడవ సంవత్సరం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి పంట భూములను 5 నుండి 15 ఎకరాల వరకు కాంపాక్ట్ బ్లాకులుగా ఏర్పాటు చేసి విత్తనం నుండి విత్తనం వరకు ఎటువంటి రసాయనాలు వాడని రైతులకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్క సిబ్బంది వారి పరిధిలోని రబీ పంటలైన వరి మొక్కజొన్న,కూరగాయలు పలు పంటలు సాగు చేస్తున్న రైతులతో మహిళలతో ఏ గ్రేడ్ మోడల్స్ ఏటీఎం మోడల్స్ వేయించాలని దీనిద్వారా రైతులకు ప్రతి నెలా నిరంతరం ఆదాయం లభిస్తుందని దీని ద్వారా వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందని సూచించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్న రబ్బీ పంట ప్రతి రైతు వివరాలను ఉర్వి యాప్ లో నమోదు చేయాలని ఆ విధంగా నమోదు చేసుకున్న వారి వివరాలను వారు పండిస్తున్న పంట వివరాలను సంబంధిత ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా మార్కెటింగ్ సదుపాయం లభిస్తుందని తెలిపారు.




