
ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధర్మనిధి సభ్యులుగా చేరాలని సమరసతా సేవా ఫౌండేషన్ గుంటూరు జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు చెప్పారు.రేపల్లె పట్టణంలోని ఎస్టీ కాలనీ రామమందిరం వద్ద జరిగిన సమరసత సేవా ఫౌండేషన్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మనిధి సభ్యత్వాలపై కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. గ్రామ సమితిల ద్వారా అన్ని గ్రామాల నుంచి ధర్మనిధి సభ్యత్వాలను తప్పక చేయించాలన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన రెండో శనివారాన్ని పురస్కరించుకుని సత్సంగం, 12న మాఘ పౌర్ణమిని పురస్కరంచుకుని సామూహిక హారతులు, 24వ తేది ఏకాదశి రోజున నగర సంకీర్తన కార్యక్రమాలను గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా పరియోజన ప్రచారక్ పొన్నపల్లి సత్యనారాయణ, సభ్యులు పడమటి వెంకటేశ్వరరావు, పేరం కోటేశ్వరరావు, జంగం శ్యామ్ ప్రసాద్, నంబూరు వేణు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




