News

నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి

55views

భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరి కుమార్ ఏప్రిల్ 30న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త నావికాదళాధిపతిని నియమిస్తూ కేంద్రప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

దినేశ్ త్రిపాఠి 1964 మే 15న జన్మించారు. 1985 జులై 1న నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్ విభాగం, ఎలక్ట్రానిక్ యుద్ధరీతుల్లో ప్రావీణ్యం ఉన్న త్రిపాఠి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

వెస్ట్రన్ కమాండ్‌ అధిపతిగా, ఫ్లాగ్ ఆఫీసర్‌గా సేవలందించారు. రేవాలోని సైనిక్ స్కూల్, ఖడక్వసాలాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో విద్యను అభ్యసించారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, నేవల్ వార్ కాలేజీ, యూఎస్ నేవల్ కాలేజీలల్లోనూ పలు కోర్సులు చదివారు.