
251views
భారత్- అమెరికా దేశాల మధ్య సముద్రంలో నిర్వహించిన త్రివిధ దళాల ద్వైపాక్షిక విన్యాసాలు (టైగర్ ట్రయంప్-2024) విజయవంతంగా ముగిసినట్టు ఆదివారం నేవీ వర్గాలు తెలిపాయి. సహాయ, విపత్తు నివారణ(హెచ్‌ఏడీఆర్)కు సంబంధించి చేపట్టిన నమూనా విన్యాసాల ప్రదర్శన ఆకట్టుకుందని పేర్కొన్నాయి. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య శిక్షణ, నిర్దేశిత ప్రయోగ విధానాలతో బహుళపక్షంగా ప్రదర్శన జరిగిందని వెల్లడించాయి. హార్బర్ ఫేజ్ విన్యాసాలు మార్చి 18 నుంచి 25 వరకు, సీఫేజ్ విన్యాసాలు మార్చి 26 నుంచి 30 వరకు కొనసాగాయని స్పష్టం చేశాయి.



