News

ఏప్రిల్‌ 9న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

433views

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆ రోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, విష్వక్సేనులవారికి విశేష సమర్పణ, 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు చేపట్టి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ పఠనం ఉంటుంది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఈ పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.