
236views
ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చిత్తూరుజిల్లా బోయకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెస్తామని రాష్ట్ర అటవీశాఖ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా బోయకొండ గంగాపురంలో అటవీశాఖ ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో 11 హెక్టార్లలో ఏర్పాటు చేసిన బోయకొండ వనాన్ని చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్పతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బోయకొండ గంగాపురంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా వనం నిర్మాణం చేపట్టామని తెలిపారు బోయకొండ గంగమ్మ అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి అందజేశారు.




