News

అయోధ్య బాలక్ రామ్, రామజన్మభూమిల సావనీర్‌ నాణేల విడుదల

382views

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మూడు సావనీర్‌ నాణేలను విడుదల చేశారు. ఇందులో ఒక నాణేన్ని అయోధ్యలోని రామ్‌లల్లా, రామజన్మభూమి బొమ్మలతో రూపొందించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషను 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వీటిని విడుదల చేశారు. బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించి ఒకటి, ఖడ్గమృగం బొమ్మతో మరొకటి ఈ నాణేలు రూపొందాయి.