Newsvideos

గణతంత్ర దినోత్సవం ప్రత్యేకం

334views

1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అనంతరం మనం మన దేశాన్ని పాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమలు చేసుకున్నాం. అప్పటి నుండి మన దేశాన్ని గణతంత్ర రాజ్యం అని అంటున్నాం. రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి జనవరి 26 తేదీనే ఎందుకు ఎంచుకున్నాం? 1930 లో జనవరి 26న అప్పటి కాంగ్రెస్ సమావేశం భారత్‌ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం చేసింది. సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానం చేసిన రోజును చారిత్రక దినంగా భావించి మనం 1950లో జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నాం.