
340views
కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు భక్తులు వేకువజామునే చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, కోవూరు గోస్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విజయవాడలోని కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం మహిళలు నదుల్లో దీపాలు వదిలి పూజలు నిర్వహించారు.




