News

జగదభిరాముడి చరిత్ర తెలిపేలా..అయోధ్య నుంచి రామేశ్వరం వరకు శ్రీరామ స్తంభాలు; 290 స్థలాల ఎంపిక

243views

శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ఆయన ప్రాముఖ్యతను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఉత్తర్​ప్రదేశ్​లోనినికి సంబంధించి కీలక ప్రకటన చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

దేశంలోని 290 ప్రాంతాల్లో శ్రీరాముడి రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యయాన్ని అశోక్ సింఘాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని వెల్లడించారు. వీటి నిర్మాణంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క రూపాయిని కూడా వాడబోమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో శ్రీరాముడు వనవాస సమయంలో అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ప్రయాణించిన మార్గంలో ‘శ్రీరామ స్తంభాలు’ ప్రతిష్ఠించేందుకు ‘అశోక్‌ సింఘాల్‌ ఫౌండేషన్‌’ 290 స్థలాలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో దశల వారీగా స్తంభాలు ఏర్పాటు చేస్తామని హిందూ మున్నని వర్గాలు తెలిపాయి. మొదటి స్తంభాన్ని అయోధ్యలోని మణిపర్వంలో ప్రతిష్ఠించారు. చివరి స్తంభాన్ని రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి అరిచ్చల్‌మునైలో ఏర్పాటు చేస్తారు.

ఈ స్తంభాల ద్వారా శ్రీరాముడి చరిత్రతోపాటు ఆయన ప్రాముఖ్యత రానున్న తరాలకు తెలుస్తుందని చంపత్ రాయ్ అన్నారు. వీటిని ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఉన్న స్థల పురాణం లాంటి వివరాలను కూడా స్థానిక భాషలోనే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేలా చూస్తామని వెల్లడించారు. అశోక్ సింఘాల్ ఫౌండేషన్ పేరుతో దిల్లీలో ఉన్న ఓ ట్రస్ట్ … శ్రీరాముడి జీవితం, ఆయన విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా వాటి వివరాలను రాతి స్తంభాలపై చెక్కి దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో స్థాపించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ స్తూపాలు దుమ్ము, వర్షం, నాచు పట్టడం వంటి వాటిని తట్టుకునే విధంగా తయారు చేయించారు.