
264views
ఏపీలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయని పేర్కొంటూ.. దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ రాఘవరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ దుర్గగుడి సూపరింటెండ్ నగేష్ నివాసంలో సోదాలు నిర్వహించగా.. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని తేలింది. నగేష్ నివాసంలో భారీగా ఆస్తులను గుర్తించారు. రూ. 17. 91 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, ద్వారకా తిరుమలలో ఓ ఇల్లును ఏసీబీ అధికారులు గుర్తించారు. నగేష్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.




