News

నరోదాగామ్‌ కేసులో నిర్దోషులుగా 67 మంది

209views

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్‌ కేసులో మాజీ మంత్రి మాయ కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. నరోదా గామ్‌లో ఇళ్లకు నిప్పు పెట్టడం వల్ల 11 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం 86 మంది నిందితులు కాగా.. విచారణ సమయంలోనే 18 మంది చనిపోయారు.

2017లో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కోర్టుకు హాజరై.. మాజీ మంత్రి మాయ కొద్నానీ తరపున సాక్ష్యమిచ్చారు. 2002లో నరేంద్ర మోదీ సారథ్యంలోని గుజరాత్‌ ప్రభుత్వంలో మాయ కొద్నానీ మంత్రిగా ఉన్నారు. 97 మందిని ఊచకోత కోసిన నరోదా పాటియా కేసులోనూ మాయ కొద్నానీ దోషిగా తేలారు. 28 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ఈ తీర్పును గుజరాత్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఉన్నత న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

2002 ఫిబ్రవరి 27న గోద్రా అల్లర్లు జరిగిన మరుసటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చారు. దీంతో 2022 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్​లోని నరోదాగామ్​లో జరిగిన మత ఘర్షణల్లో 11 మంది చనిపోయారు. అల్లర్లు జరిగిన సమయంలో మాయ కొద్నానీ.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దీంతో మాయ కొద్నానీ సహా మరికొందరిపై కేసు నమోదైంది. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం.. మాజీ మంత్రి మాయ కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.