
351views
మేడ్చల్ జిల్లా బాలానగర్ లో ఎంఆర్‌వో కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. జెండాను భద్రపరచాల్సిన సిబ్బంది దాన్ని చెత్త కుప్పలో పడేశారు. నిత్యం అధికారులు వస్తూ వెళ్తున్నా.. పట్టించుకోకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై పై అధికారులు స్పందించాల్సి ఉంది.




