News

భారత్‌లో తొలి యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌.. ప్రారంభించిన టిమ్‌కుక్‌

237views

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ దేశీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. యాపిల్‌ బీకేసీ పేరుతో ముంబైలో ఏర్పాటైన యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌కు ప్రారంభించారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై బాంద్ర కుర్లా కాంప్లెక్స్‌లో అందుబాటులోకి వచ్చిన రిటైల్‌ స్టోర్‌లో యాపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసే సౌకర్యం కలగింది.
మరోవైపు రిటైల్‌ స్టోర్‌ను యాపిల్‌ ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు స్టోర్‌ వద్ద బారులు తీరారు. స్టోర్‌ ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తెల్లవారుజాము నుంచి దీని ముందు పడిగాపులు కాశారు.