సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిబా ఫులే
మహాత్మా జ్యోతిబా ఫూలే 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. 28నవంబర్ 1890లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కన్హరే, వాసుదేవ బలవంత ఫడ్కే...
