పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...


