
లక్నో : మదర్సాలలో నేపాలీ వ్యక్తులు కూడా నియుక్తులు అవుతున్నారు. అయితే.. ఇది ప్రభుత్వాలకు తెలియకుండా జరిగిపోతోందన్న విమర్శలు తరుచూ వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ముబారక్పూర్లోని మదర్సా అష్రఫియా మిస్బాహుల్ ఉలూమ్లో 2016లో నేపాలీ పౌరుడైన మౌల్వీ మహమ్మద్ రజా నియామకానికి సంబంధించి వివాదం తలెత్తింది. ఆ ఉపాధ్యాయుడికి విదేశీ పౌరసత్వం ఉందన్న విషయాన్ని దాచిపెట్టి మదర్సా యాజమాన్య కమిటీ ఈ నియామకం చేపట్టిందని, తద్వారా ఆయన ప్రభుత్వ ప్రయోజనాలను పొందేలా చేసిందని ఆరోపిస్తూ ముబారక్పూర్ నివాసి మహమ్మద్ అరబీ ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు రావడంతో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ కూడా ప్రారంభమైంది. విచారణ పూర్తయిన తర్వాత, సంబంధిత రికార్డులు మరియు వాస్తవాల ఆధారంగా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.భారత్-నేపాల్ మధ్య 1950లో కుదిరిన శాంతి మరియు స్నేహ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం నేపాలీ పౌరుడి నియామకం చెల్లుబాటు అవుతుందని మదర్సా యాజమాన్యం వాదిస్తోంది.
దీని ఆధారంగా, ఈ నియామకం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని యాజమాన్యం పేర్కొంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఉంది. విచారణ నివేదిక సమర్పించినఈ నిర్ణయం ఆధారంగా ఆ మదర్సాకు సంబంధించి తదుపరి పరిపాలనాపరమైన చర్యలను కూడా నిర్ణయించవచ్చు. తర్వాత, ఆ సమయంలో అమల్లో ఉన్న నిబంధనలు మరియు ‘భారత్-నేపాల్ స్నేహ ఒప్పందం’లోని అంశాల ప్రకారం ఈ ఉపాధ్యాయుని నియామకాన్ని ఎలా పరిగణించాలనే విషయం స్పష్టమవుతుంది.