News

సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు కేసు : హాజరుకావాలని ఖర్గే, నలపాడ్ ను ఆదేశించిన కోర్టు

24views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు విషయంలో స్వయంగా తమ ఎదుట హాజరవ్వాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే, కాంగ్రెస్ నేత మహ్మద్ నలపాడ్ లను బెంగళూరు కోర్టు ఆదేశించింది. వచ్చే నెల 1 న స్వయంగా తమ ముందు హాజరవ్వాలని ఆదేశించింది.
పోలీసుల ద్వారా గతంలో పంపిన సమన్లు అందలేదని నివేదికలు రావడంతో 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కొత్త సమన్లను జారీ చేసింది.
బెంగళూరుకి చెందిన ఎ. తేజస్ గౌడ్ వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఖర్గే, మహ్మద్ నలపాడ్ పై కేసు నమోదైంది. ప్రియాంక్ ఖర్గే, మహమ్మద్ నలపాడ్‌లు చేసిన ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు ఆర్‌ఎస్‌ఎస్‌ను అపకీర్తి పాలు చేశాయని, దాని ప్రజా ప్రతిష్టను దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు.ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఆ పోస్ట్ కంటెంట్ అవమానకరంగా ఉందని, ఆ సంస్థ మరియు దాని సభ్యుల ప్రతిష్టను తగ్గించిందని ఫిర్యాదుదారు వాదించారు.
మహమ్మద్ నలపాడ్ కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు కూడా సంస్థ యొక్క ఇమేజ్ మరియు సద్భావనను దెబ్బతీశాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
గతంలో జారీ చేసిన సమన్లు సరిగ్గా అందలేదని గుర్తించిన కోర్టు.. మళ్లీ కొత్తగా న్యాయమూర్తి సందీప్ పాటిల్ సమన్లు జారీ చేశారు. నిందితులిద్దరూ ఆగస్టు 1న స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు రికార్డుల ప్రకారం, ఫిర్యాదులో ప్రియాంక్ ఖర్గేను ఎ1 (Accused No.1)గా, మహమ్మద్ నలపాడ్‌ను ఎ3 (Accused No.3)గా పేర్కొన్నారు.