
దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరీలో ఈ మహా ఉత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వనాలు, శంఖ నాదాల మధ్య జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒడిశాతో పాటు దేశంలోని నలుమూలలా ఈ పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ ఆధ్యాత్మిక సంబరాల నడుమ కొందరు చిన్నారులు బొమ్మలతో చేసిన జగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది చిన్నారులు తమ సృజనాత్మకతతో జగన్నాథుని రథయాత్రను లాగుతున్నారు. ఒక చిన్న ఆటబొమ్మ ట్రక్కును జగన్నాథ రథంగా మార్చేశారు. బొమ్మలతో తయారు చేసిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించారు. ఓ తాడుకు పూలు, రంగు కాగితాలు అతికించి రథాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో లాగుతూ వేడుక జరిపారు. చిన్నారుల కళాత్మకత, నిష్కల్మషమైన భక్తిభావం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ పండుగల గొప్పతనాన్ని, సంస్కృతిని నేటి తరం పిల్లలు ఇంత చక్కగా అర్థం చేసుకుని ఆచరించడం అభినందనీయమంటూ వేలాది మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.





