News

మదర్సాలో భగవద్గీత పఠనానికి మౌలానా అనుమతి.. అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్

251views

మధ్యప్రదేశ్ సెహోర్ జిల్లాలోని ఒక మదర్సాలో ఖురాన్ తో పాటు భగవద్గీతను బోధించడం ప్రారంభించమని పోలీసు అధికారి సలహా ఇచ్చారు. మదర్సాలో భగవద్గీత పఠనానికి అక్కడి మౌలానా అనుమతి ఇవ్వడంతో ఎప్పటిలానే కాంగ్రెస్ పార్టీ దానిని వ్యతిరేకించింది

గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ పోలీస్ సర్వీస్ అధికారి రాజా బాబు సింగ్ ఇస్లామియా మదీనా-తుల్-ఉలూమ్ సంస్థ విద్యార్థులకు గీతలో భోదించిన కర్మయోగం నైతిక విలువల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ అంశాలు సానుకూల ఆలోచన మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. మదర్సాలో ఖురాన్ తో పాటు భగవద్గీతను బోధించడం ప్రారంభించమని మదరసా మౌలానాకు సూచించారు.

పోలీసు అధికారి సూచనకు మదరసా మౌలానా అమీన్ ఉల్లా స్పందిస్తూ, సమాజం మరియు దేశం యొక్క పురోగతికి దోహదపడే సానుకూల సందేశాన్ని అందించే ఏ గ్రంథాన్ని బోధించడానికి తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఆయన మొదట గీతను స్వయంగా చదివి, తరువాత దానిని విద్యార్థులకు బోధించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. రాజా బాబు సింగ్ సూచనను స్థానిక బిజెపి ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ సమర్థించారు.

దీని పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు అబ్బాస్ హఫీజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మౌలానాస్ మదర్సాలలో మంచి బోధనలే చేస్తున్నారని, వారికి జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. పోలీసు అధికారులు శాంతిభద్రతలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని వాపోయారు.