News

భారతదేశ సమగ్ర స్వరూపానికి మూల సిద్దాంతంగా ఏకాత్మతా మానవతా సిద్ధాంతం : సంతోష్‌

288views

విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్‌ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్‌ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్‌ గారు పాల్గొన్నారు

ఆయన గురించి మంత్రి సత్యకుమార్ పరిచయం చేశారు. ఈ దేశ గతిని మార్చి ప్రపంచానికి వెలుగు చూపిన ఏకాత్మమానవతా వాదాన్ని పండిత్ దీన్‌దయాళ్‌జీ విజయవాడలో ప్రవచించిన రోజు ఏకత్మమానవ దర్శన్ సమకాలీన సమాజానికి ఎలా అన్వయించుకోవాలో సంతోష్‌జీ వివరిస్తారు. ఈ 12 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ది గురించి అవగాహన ఉన్నవారికి పెద్దలు సంతోష్‌జీ గురించి తెలిసే ఉంటుంది. ఆయినా కుప్తంగా పరిచయం చేస్తాం. కర్నాటకలోని కోస్తా ప్రాంతంలో జన్మించారు. దావణగెరేలో ఇంజనీరింగ్ చదివి, టెలికాంలో కొంతకాలం పనిచేశారు. చిన్ననాటి నుంచి జాతీయవాద భావాలున్నవారు. గతించిన విశ్వగురు పునర్వైభవం, భారతదేశం కీలక స్ధానం పొందాలనే భావనతో ఆయన 1993లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నారు.

బిజెపి జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి సంతోష్‌ గారి ప్రసంగం…
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక కొత్త రూపమే దీన్‌దయాళ్‌జీ ప్రవచించిన ఏకాత్మతా మానవతా దర్శనం. భారతదేశ సమగ్ర స్వరూపానికి ఒక మూల సిద్దాంతంగా ఏకాత్మతా మానవతా సిద్దాంతాన్ని పేర్కొనవచ్చు. మనం భావదాస్యం నుంచి బయటకు రావాలని సంతోష్ జీ ఈ వేదిక నుంచి పిలుపునిచ్చారు. అప్పుడే మనం వికసిత్ భారత్‌ను చూడగలుగుతామన్నారు. పాశ్చాత్య భావజాలం నుంచి బయటకు చూడాలని ఆయన హితవు పలికారు. ఏ సిద్ధాంతాన్నైనా గుడ్డిగా అనుసరించవద్దని, పేర్కొన్నారు. మనం విదేశాల నుంచి ఆహారపు అలవాట్లు అనుసరించడం మానుకోవాలన్నారు. భారతీయలలోనే సర్దుబాటు తత్వం ఉందన్నారు. భారతీయత సమాజం అంతటికీ మేలు చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మాలకు కట్టుబడి పనిచేసి ప్రజాక్షేమం కోసం ముందుకు రావాలన్నారు. గాంధీజీ పేర్కొన్న అంశాలు సర్వోదయ, అంత్యోదయ మూడింటిని కలిపి నేటి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తోందన్నారు. సమాజాన్నంతటిని పట్టిఉంచేది ధర్మమని, ఆయన చెప్పారు. ధర్మాన్ని అనుసరించలేని ఏ సంస్కృతి మనుగడ ఉండదన్నారు.అందువల్లే విదేశీ సంస్కృతులు కాలగర్భంలో కలసిపోయాయన్నారు. ఈ విధంగా భారతీయతత్వంలోనే అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా “ఏకాత్మా మానవ దర్శనం @60” పేరుతో రూపొందించిన జాగృతి సంచికను ఆవిష్కరించారు.