News

గీత పఠనంతో పరీక్షల ఒత్తిడి తగ్గుదల

252views

బిహార్‌లోని గయాలో దాదాపు 2,500 మంది విద్యార్థులు చదువుతున్న దయాప్రకాశ్‌ సరస్వతీ విద్యామందిర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ పాఠశాల టీచరు షాలిని రాజ్‌పూత్‌ విద్యార్థులు మంత్రముగ్ధులు అయ్యేలా సంస్కృతంలోని భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తూ సరళమైన హిందీ భాషలో వాటి సారాంశాన్ని వివరిస్తున్నారు. తద్వారా పరీక్షల వేళ తమకు మానసిక ఒత్తిడి దూరమవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. రెండేళ్ల కిందట ఈ విద్యామందిర్‌లో టీచరుగా చేరిన షాలిని మొదట్లో ఇతర టీచర్లలాగే పాఠ్యాంశాల బోధనకు పరిమితం అయ్యేవారు. రాను రాను పరీక్షల వేళ విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయాన్ని ఆమె గుర్తించారు. సంగీతం నేర్చుకొన్న షాలిని ఈ సమస్యకు కనుగొన్న పరిష్కారమే గీతా పఠనం. పాఠశాల నిర్వాహకులు ఆమె చొరవను అభినందించి ప్రోత్సహిస్తున్నారు. భగవద్గీత సంస్కారం నేర్పుతుందని, విద్యార్థులంతా చాలా ఉత్సాహంగా తనతో కలిసి శ్లోకాలను ఆలపిస్తున్నట్లు షాలిని తెలిపారు.