
నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న హిందూ సమ్మేళనాలు హిందువులలో నిద్రాణమై ఉన్న హిందుత్వాన్ని తట్టి లేపుతున్నాయి.సాయిబాబా నగర్ బస్తీ లో జరిగిన హిందూ సమ్మేళనంలో విశ్రాంత స్టేట్ బ్యాంకు ఉద్యోగి శ్రీ పరాయితం కేశవమూర్తి అధ్యక్షతన సమావేశమైన సభలో ప్రవచన కారులు శ్రీ హరి బాబు, విశిష్ట మహిళా ప్రవచనకారులు శ్రీమతి రాధా లక్ష్మీ , కర్నూల్ విభాగ్ ఇతిహాస సంకలన ప్రముఖ్ శ్రీ మన్నవ వేణుగోపాల్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ప్రవచన కారులు మాట్లాడుతూ భారత్ ను బైబిల్ దేశంగా మార్చుటకు విక్టోరియా రాణి కామన్స్ సభలో వేలంపాట నిర్వహించగా రాబర్ట్ క్లైవ్ ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నారని, వారు సాగించిన దారుణ మారణ కాండను వివరించారు. పుబ్బలో పుట్టి మఖలో సమసి పోయే అనాగరిక, అశాస్త్రీయ విధర్మీయ మతాలు, స్వర్గం, నరకం, పాపం అంటూ అమాయకులను మభ్యపెట్టి సశాస్త్రీయమైన, నిత్య నూతనమైన, సత్య సనాతన ధర్మ ఆచార వ్యవహారాలను వక్రీకరించి, వంకలు చూపి, ప్రలోభ పెట్టి, భయపెట్టి మతమార్పిడి చేస్తున్నారని. ఇచ్చి పుచ్చుకోవడానికి, నోములకు, వ్రతాలకు మాత్రమే కులగోత్రాలు, గడప దాటితే మనమంతా హిందువులం అని ఎలుగెత్తి చాటి హిందువులంతా ఐక్యంగా నిలవాలని తెలిపారు.
వక్త సందేశంలో “అహింసో పరమో ధర్మః” అనే వేద మంత్రాన్ని కుట్రపూరితంగా సగం మాత్రమే చెప్పి ” ధర్మ హింసా తథైవచా” అనే సగాన్ని దాచి హిందువుల క్షాత్రాన్ని నీరు గార్చారని. సర్వం త్యజించి అడవుల కేగిన శ్రీరామచంద్రుడు ధనుర్భాణాలు త్యజించ లేదే, ధర్మాన్ని పరిరక్షించడానికి సుదర్శన దారి అయిన శ్రీకృష్ణుడు, దశ ప్రహరణ దారి అయిన దుర్గామాతగా మనం మారాలని ఉద్భోదించారు. భారతమాత యొక్క పరం వైభవ స్థితి అయిన విశ్వ గురు స్థానానికి ప్రస్థానింప జేయుటకు సంఘం నిర్దేశించిన పంచ పరివర్తన్ విధి విధానాలను వివరించారు. మన చిన్నారుల బంగారు భవితకు వాటిని మనం అందరం తూచా తప్పక పాటించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చతుర్విధ అభినయ నృత్యం కేంద్రం ఆచార్యులు శ్రీ శివ చంద్రమౌళి (యంఏ. కూచిపూడి) వారి బృందం. జవహర్ బాల భవన్ నృత్యా చార్యులు శ్రీ నరసింహులు గారి బృందం, శ్రీ వాల్మీకి రామాలయం అభ్యాసిక విద్యార్థులు, శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థినుల బృందం సాంస్కృతిక నృత్యాలు, కోలాటం ప్రేక్షకులను ఆద్యంతం అలరించాయి.
ఈ కార్యక్రమం విజయానికి అహరహం కృషి చేసిన మాతృమూర్తులకు, కార్యకర్తలకు ఆర్థికంగా, హార్థికంగా సహకరించిన వధాన్యులు అందరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
భారత మాత పూజ తో ప్రారంభమైన కార్యక్రమం, శాంతి మంత్రం, అల్పాహారంతో సంపన్నమైంది.





