
256views
సమాజంలోని ప్రజలంతా సనాతన హిందూ ధర్మాన్ని పాటించాలని హిందూ సమ్మేళనం ధర్మ ప్రచారకులు, బొబ్బిలి విశ్రాంత ఉపాధ్యాయులు కొల్లూరు జగన్నాథం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ సమాజంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సమాజ రక్షణకు పాటుపడాలని, హిందూ ధర్మాన్ని రక్షించాలని ఆయన కోరారు. సమరసత సేవా ఫౌండేషన్ డివిజన్ ధర్మ ప్రచారకులు దూపం వాసు, బలిజిపేట సత్యసాయి కన్వీనర్ వెలిది సుబ్బారావు, మండలంలోని బర్లి, వెంగాపురం, నారాయణపురం, పక్కి, అంపావల్లి, తుమరాడ గ్రామాలకు చెందిన ధర్మ ప్రచార కమిటీ సభ్యులు పాల్గొన్నారు.





