
బంగ్లాదేశ్ లో అక్రమంగా నివసిస్తున్న మియా ముస్లింలను తొలగించాలని, వారి ఇన్నర్ లైన్ పర్మిట్ ను రద్దు చేయాలని అరుణాచల్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన దళం (IYFA) మరియు అరుణాచల్ ప్రదేశ్ స్వదేశీ యువజన సంస్థ (APIYO) సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించాయి. ‘‘వందేమాతరమ్, భారత్ మాతాకీ జై’’ అంటూ నినాదాలు చేశారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో వలసదారులకు స్థానమే లేదని, వారిని వెంటనే పంపించేయాలని డిమాండ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలు ఎప్పటికీ బంగ్లాదేశ్ లో అంతర్భాగం కాలేవని స్థానికులు తేల్చి చెప్పేశారు. భద్రతా సమస్యే దేశానికి ప్రధాన సమస్య అని, రాష్ట్రంలో అక్రమవలసదారులు పెరిగిపోతున్నారని, వెంటనే వారిని వెనక్కి పంపేయాలని డిమాండ్ చేశారు.ఆ వర్గం వారే హత్యలు, దోపిడీ, అత్యాచారాలు, లవ్ జిహాద్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
IYFA నాయకురాలు కమతా పసంద్ మాట్లాడుతూ, “ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌లో భాగం చేయాలనేది వారి కల. బంగ్లాదేశ్‌లోని చాలా మంది నాయకులు తరచుగా బహిరంగంగా ఈ విషయాన్ని చెబుతున్నారు. మేము భారత దేశ పౌరులం. ఎవరైనా మన దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగానే వున్నాం. మా సత్తా ఏమిటో చూపించడానికే ఈ ర్యాలీ’’ అని పేర్కొన్నారు.
ఈ భూమి తమకు తల్లి లాంటిదని, ఇక్కడి భూమి, గాలి, నీరు.. ఇలా అన్నింటికీ తామే యజమానులమని ప్రకటించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లాక్కోడానికి అక్రమంగా వచ్చిన స్థిరపడిన వారికి ఏమాత్రం హక్కు లేదని కమతా పసంద్ అన్నారు.
APIYO నాయకుడు తారో సోనమ్ మాట్లాడుతూ, ఈ వ్యక్తులు ఆధార్ కార్డు, నకిలీ ILP మొదలైన నకిలీ ఐడీలతో అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించారని అన్నారు. తాము 200 మందికి పైగా అక్రమ స్థిరనివాసులను తొలగించామని, డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతాయని ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమే కావొచ్చు. కానీ మేము భారతీయులం. ఈ దేశానికి వ్యతిరేకంగా ఏలాంటి కార్యకలాపాలను కూడా అనుమతించం’’ అని ప్రకటించారు.





