
నంద్యాల జిల్లా, స్థానిక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ, జాతీయ కమిటీ పిలుపు మేరకు, భగవాన్ బిర్సాముండా 150 వ జయంతి వేడుకలను “జన జాతీయ ఆత్మ గౌరవ దినోత్సవం”ను నంద్యాలలోని బొమ్మల సత్రం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన శ్రీ ఈ.వెంకటయ్య, సైనికాధికారి, ఉపాధ్యాయుడు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి (పూర్వ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నంద్యాల కార్యవాహ శ్రీ వీరేంద్ర భగవాన్ బిర్షా ముండా చిత్రం పటానికి మాలార్పన కావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థి పరిషత్ నంద్యాల బాగ్ కన్వీనర్ శ్రీ లక్ష్మీ నరసింహ పరిచయ వాక్యాల తదుపరి వక్త మాట్లాడుతూ 1947 న వాస్తవంగా మనకు స్వాతంత్ర్యం రాలేదని, విధర్మీయ శక్తులకు వత్తాసు పలికే కాంగ్రేసు ప్రభుత్వం మనకు ఆత్మ విస్తృతి కలిగించేలా మన వీరుల చరిత్రను వక్రీకరించి, మన పూర్వీకులను నానా హింసలు పాలుజేసి మన సంపదను, సంస్కృతీ సాంప్రదాయాలను కొల్ల గొట్టిన క్రూరులను గొప్పవారిగా చిత్రీకరించారని తెలియజేశారు. ఇప్పుడిప్పుడే జాతీయ విద్యావిధానంలో మన అసలైన చరిత్రను, ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియ జేశారు. అందులో భాగమే భగవాన్ బిర్సా ముండా చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారని తెలియజేశారు.

” బ్రిటిషర్ల పరిపాలన కాలంలో, జార్ఖండ్ రాష్ట్రంలో, ఊలిహాట్ గ్రామంలో నవంబర్ 15, 1875 లో జన్మించిన, స్వాతంత్ర ఉద్యమ రూపకర్త, కేవలం 25 సం మాత్రమే జీవించిన అడవి తెగకు చెందిన బిర్సా ముండ ఎందరో అడవి బిడ్డలకు స్ఫూర్తి దాతగా నిలిచి భగవాన్ బిర్సాముండాగా చరిత్రలో నిలిచి పోయాడని తెలియ జేశారు. బాల్యం నుండే బిర్సా ముండా ఆయన చదువుతున్న క్రైస్తవ మిషనరీ పాఠశాలలో జరిగే మతమార్పిడి కార్యక్రమాలను వ్యతిరేకించి పాఠశాల చదువు ఆపేసారని చెప్పారు.
బిర్సా ముండా ఒక గురువుగారిని ఆశ్రయించి, సనాతన ధర్మానికి సంబంధించిన వేద,యోగా, ధ్యాన విద్యలను అభ్యసించి ధార్మిక ప్రచారాన్ని కొన సాగించారు. ముండా జాతి యువకులను సమీకరించి స్వాతంత్ర్య ఉద్యమానికి పురుడు పోసిన మహనీయుడని, ఇలాంటి గొప్ప మహనీయుల జీవితాలను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.
విద్యార్థి పరిషత్ మూల సూత్రాలైన “జ్ణాన! శీల!! ఏక్తా!!!”లే లక్ష్యంగా విద్యార్థిగా ప్రధాన ధర్మమైన జ్ణాన సముపార్జనలో ప్రథములుగా నిలుస్తూ, జాతీయ, సామాజిక, వ్యక్తిగత శీలాన్ని కలిగి ఉంటూ, ఐకమత్యంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ భారతమాత పరవైభవ స్థితికి కంకణ బద్దులు కావాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పరిషత్ కార్యకర్తలు శ్రీ మణి, శ్రీవెంకటేష్ లతో పాటు, 80 మంది తరుణ విద్యార్థులు పాల్గొన్నారు.
ముమ్మారు ఓంకారం తో ప్రారంభమైన కార్యక్రమం భారత్ మాతాకీ జయ కారాలతో సంపన్నమైంది.




