
పాకిస్థాన్ ఫుట్ బాల్ జట్టు మాటున జపాన్ లో పర్యటించేందుకు ప్రయత్నించిన ఓ నకిలీ ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నకిలీ జట్టును గుర్తించిన జపాన్ అధికారులు వారిని తిరిగి స్వదేశానికి పంపించేశారు. ఈ విష యాన్ని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఎఐఏ) వెల్లడించింది. ఎఫ్ఎఏ వివరాల మేరకు.. జపాన్ లో జరుగుతున్న ఫుట్ బాల్ టోర్నమెంటులో పాల్గొనాలంటూ మొత్తం 22 మంది సభ్యులు పాకిస్థాన్ లో 15 రోజుల వీసాను సంపాదించగలిగారు. ఈ ఏడాది జూన్ లో వారంతా జపాన్ ను చేరుకున్నారు. ఫుట్ బాల్ ఆటగాళ్ల దుస్తులు కూడా ధరించారు. పాకిస్థాన్ ఫుట్ బాల్ ఫెడరే షన్ (పీఎఫ్ఎఫ్) జారీ చేసే నిరభ్యంతర పత్రాలనూ సృష్టించారు. జపాన్ చేరుకున్నా.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయారు. వీరిపై అనుమానంతో అధికారులు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది. అక్కడి నుంచే నకిలీ ముఠాను మరో విమానంలో పాకిస్థాన్ కు తరలించారు. పాకిస్థా న్లోని సియాల్ కోట్ కు చెందిన మాలిక్ వకాస్ వీరిని అక్రమంగా జపాన్ కు పంపినట్లు ఎఫ్ఎ తెలిపింది. అతడిని అదుపులోకి తీసుకొని.. విచారణ జరు పుతున్నట్లు వెల్లడించింది. జపాన్ కు వీసా ఇప్పించడానికి వకాస్ 22 మంది నుంచి కోటికి పైగా పాకిస్థానీ కరెన్సీని వసూలు చేశాడు.





