News

కేదార్‌నాథ్‌కు కేబుల్‌పై వెళ్లేలా

192views

ఉత్తరాఖండ్‌లోనని ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్‌నాథ్‌కు రోప్‌వేలో వెళ్లే అవకాశం సాకారం కానుంది. ఈ క్షేత్రాన్ని ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే సందర్శించొచ్చు. ఈ సమయంలోనే ఏటా 20 లక్షల మంది భక్తులు వస్తుంటారు. రుద్రప్రయాగ్‌ జిల్లాలోని సోన్‌ప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథ్‌ను అనుసంధానం చేస్తూ 13 కి.మీల మేర రోప్‌ వే నిర్మించేందుకు రూ.4,081 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టుకు మార్చిలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పనుల బాధ్యత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు దక్కింది. ఆరేళ్లలో పూర్తిచేయనుంది. – ప్రస్తుతం కేదార్‌నాథ్‌ వెళ్లేందుకు సోన్‌ప్రయాగ్‌ వరకే రోడ్డుంది. అక్కడ నుంచి యాత్రికులు కొండమార్గంలో 17 కి.మీ. నడవాల్సి వస్తోంది. 9 గంటలు పడుతోంది. – రోప్‌ వే నిర్మిస్తే సోన్‌ప్రయాగ్‌ నుంచి 36 నిమిషాల్లోనే కేదార్‌నాథ్‌కు చేరొచ్చు. గంటలో ఒక వైపునకు 1,800 మందిని చేరవేయొచ్చు.