News

ఆలయం కూల్చివేతకు యత్నం

232views

రహదారి నిర్మాణం పేరిట ఆలయం కూల్చేందుకు యత్నించారు. ఈ మేరకు స్థానికులు అడ్డుకున్నారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్‌లో వినాయస్వామివారి ఆలయాన్ని కాలనీ వాసులే నిర్మించుకున్నారు. స్వామివారికి కై ంకర్యాలను నిర్వహించుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాల తరుణంలో ఆలయ అలంకరణకు సన్నద్ధమయ్యారు. సన్నాహాలు చేస్తున్నారు.

తిరుచానూరు సమీపంలోని ఓరియన్‌ హోటల్‌ నుంచి పద్మావతిపురం వరకు సుమారు రూ.4కోట్ల టీటీడీ నిధులతో తుడా ఆధ్వర్యంలో రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే శిల్పారామం వెనుక చెరువు కట్టపై ఈ పనులు చేపట్టారు. అయితే రహదారి విస్తరణలో భాగంగా చెరువు పక్కన ఉన్న శ్రీవినాయక స్వామి ఆలయాన్ని కూల్చివేసేందుకు కొంతమంది అధికారులు యత్నించారు. దీంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. గుడిని కూల్చివేయాలని చూడడం దారుణమని మండిపడ్డారు. చెరువు స్థలం ఉన్నప్పటికీ, గుడిని తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను ధ్వంసం చేయడం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించినా, దాడులు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు.