News

8న టిటిడి ‘సౌభాగ్యం’

175views

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 8న టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్తు సంయుక్తంగా ‘సౌభాగ్యం’ పేరిట సుమంగళి ద్రవ్యాలు పంపిణీ చేయనుంది. ఇందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సౌభాగ్యం సామగ్రికి శ్వేతా భవన హాలులో దేవస్థానం, డీపీపీ అధికారులు, శ్రీవారి సేవకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వారీగా మంగళ ద్రవ్యాల పార్సిల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాల్లో వ్రతం రోజున ‘సౌభాగ్యం’ ప్రసా దాన్ని మహిళలకు పంపిణీ చేయనున్నారు. సుమంగళి ద్రవ్యాల్లో గాజులు, శ్రీపద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలు ఉన్నాయి.