News

గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ

367views

గ్రామీణ వికాస్ సంఘం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా ఘనసర గ్రామంలోని కలం డ్రీమ్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన సుమారు 110 మంది విద్యార్థులకు డాక్టర్ శ్రీ ప్రసన్నకుమార్, శ్రీ గుడ్ల కృష్ణారావు గారు, సాసుపల్లి కాశి బాబు నాయుడు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు.

ఈ సందర్బంగా గుడ్ల కృష్ణ రావు మాట్లాడుతూ, మారుమూల గ్రామంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు.

డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని, ప్రతి ఒక్కరూ కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలన్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ని ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో భాగంగా గ్రామీణ వికాస్ సంఘం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఉపయోగపడేలా 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఘనసర గ్రామంలో ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అవసరమైతే గ్రామీణ వికాస్ సంఘం కార్యకర్తలను సంప్రదించ్చవచ్చని తెలిపారు.