
366views
ఈనెల 16న జరిగే ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్-ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, వర్మ, లక్ష్మీనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కడప ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడుతూ 16వ తేదీ ఉదయం 7 గంటలకు కడప బిల్టప్ సమీపంలోని అంబాభవాని దేవస్థానం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. రెండో గాంధీ బొమ్మ, గోకుల్‌కూడలి, ఏడురోడ్లు, ఎన్టీఆర్ కూడలి, కోటిరెడ్డి కూడలి, కాగితాలపెంట, నభీకోట, మరాఠావీధి మీదుగా తిరిగి అంబాభవాని దేవస్థానానికి చేరుకుంటుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాల్లో పెంపొందించే విధంగా ఈ యాత్ర ఉంటుందన్నారు. భారవి, శోభాభాయ్, లక్ష్మణ్‌రావు తదతరులున్నారు.




