
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో సింగర్భ పంచాయతీ మొండికోటలో చిద్గాగనంద స్వామిజీ ఆశ్రమంలో శుక్రవారం అడవి తల్లికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గిరిజన దంపతులు సాగేని చినబాబు ఆచారి, కిముడు పొట్టాచారి, సాగేని కొండాచారి, పాంగి రమణమూర్తి, పాంగి చిట్టిబాబు, గండేరి చిన్న కృష్ణ ఆచారి, శివలింగం ఆచారి, కిముడు శ్రీనివాసాచారి, పాంగి రాజాచారిలకు ఆమె పాదసేవ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతిపై సమస్త జీవరాసులు ఆధారపడి ఉన్నందున అడవితల్లిని కాపాడుకోవాలని ఆమె కోరారు. మొక్కలు నాటి ప్రకృతిని పరిరక్షించాలని ఆమె కోరారు. ప్రతీ ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలని ఆమె తెలిపారు. అన్నమయ్య కీర్తనలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. కార్యక్రమంలో చిద్గాగానందస్వామిజీ ఆశ్రమం సభ్యులు సాగేని రమానందం, చిట్టాచారి, పాంగి నూకరాజు, పి చిట్టాచారి, పాంగి శ్రీహరి, భక్తులు పాల్గొన్నారు.




