News

బంగ్లాదేశ్ పరిణామాలే భారత్ లోనూ… అంటూ పోస్ట్ చేసిన ముస్లిం యువకుడి అరెస్ట్

256views

బంగ్లాదేశ్ లో సంభవించిన పరిణామాలే భారత్ లోనూ సంభవిస్తాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న అసోం ముస్లిం యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ పరిణామాలే భారత్ లో పునరావృత్తం అవుతాయంటూ ప్రచారం చేస్తున్న హైలకండి జిల్లాకి చెందిన రెజువాన్ ఉల్లా మజర్ బుయాని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ‘‘బంగ్లా తర్వాత ఇక ఇప్పుడు భారత్ వంతు. అసోంలోనూ బంగ్లాదేశ్ సంఘటనలే పునరావృత్తం అవుతాయి’’ అంటూ బెంగాలీ భాషలో పోస్ట్ చేశాడు. మరోవైపు ఈ యువకుడికి ఇస్లామిక్ ఉగ్రవాదులతోనూ సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయి… అదుపులోకి తీసుకొని, ఈ పోస్ట్ పై ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఇస్లామిక్ ఉగ్రవాద నిషేధిత సంస్థతో వున్న సంబంధాలపై కూడా ప్రశ్నిస్తున్నారు.కొన్ని రోజుల కిందటే సీఎం హిమంత బిస్వ శర్మ ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న అశాంతి, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఉగ్రవాద సంస్థలు కచ్చితంగా ఈ పరిణామాలను వాడుకునే ఛాన్స్ వుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేస్తున్న అనేక ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ సురక్షిత స్థలంగా వుండేదన్నారు.