
270views
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమ నౌక ఆదిత్య-ఎల్1 మంగళవారం విజయ వంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. ఆదిత్య-ఎల్1ను గత ఏడాది సెప్టెంబరు 2న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 6న అది ఎల్1 కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడ ఒక పరిభ్రమణం పూర్తికావడానికి 178 రోజులు పడుతుంది. ఈ కక్ష్యలో తిరిగేటప్పుడు రోదసిలోని వివిధ రకాల బలాలు వ్యోమనౌకపై పనిచేస్తాయి. ఫలితంగా దాని లక్షిత ప్రయాణ మార్గంలో వైరుధ్యాలు తలెత్తుతుంటాయి. ఫలి తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న, జూన్ 7న ఆదిత్య-ఎల్1 గమనంలో అవసరమైన సర్దు బాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేయాల్సి వచ్చింది. మంగళవారం మూడోసారి ఈ కసరత్తును నిర్వ హించారు. రెండో కక్ష్యలో దాని ప్రయాణం కొన సాగేలా చూడటం దీని ఉద్దేశం.




