
388views
టిబెట్లో ఉన్న కైలాస పర్వతాన్ని భారత భూ భాగం నుంచే దర్శించే అవకాశం భక్తులకు కలగనుంది. ఉత్తరాఖండ్ పిథో రాగఢ్ జిల్లా వ్యాస్ వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తున ఉండే పాత లిపులేఖ్ పాస్ నుంచి కైలాస పర్వతం, ఓమ్ పర్వత్ స్పష్టంగా కనిపిస్తాయని జిల్లా పర్యాటక అధికారి కీర్తి చంద్ర ఆర్య పేర్కొన్నారు. సెప్టెంబరు 15 నుంచి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.




