
319views
శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం స్వామి, అమ్మవార్లకు ధవనోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. ప్రధానాలయ రాజగోపురానికి ఎదురుగా శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ఠాపన చేసి ఆజ్యం, దవనం, గుగ్గిలం ఆహుతిగా వేసి స్వామి, అమ్మవార్లకు ధవనోత్సవం చేశారు. కార్యక్రమంలో ముందుగా అర్చకులు లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ సంకల్పం పఠించారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు, ఏఈవో హరిదాసు, స్వామివారి ప్రధానార్చకులు శివప్రసాద్‌స్వామి పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం అక్కమహాదేవి జయంతి వేడుకను దేవస్థానం నిర్వహించింది. ఆలయ ఈవో డి. పెద్దిరాజు పాల్గొన్నారు. కుంభోత్సవం నేపథ్యంలో మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు.




