
303views
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.లక్కీ అనే మారు పేరుతో పరిచయమైన ముస్లిం యువకుడు సవేజ్ అలీ హిందూ బాలికపై ప్రేమ పేరుతో పలు అకృత్యాలకు పాల్పడ్డాడు.ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆ యువతి వద్ద ఉన్న నగలను రూ. 4 లక్షల నగదును దోచుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన యువతి నిందితునిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ పేరుతో మోసగించిన సవేజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక డిమాండ్ చేస్తోంది.
Source : VSK Malwa




