
354views
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా నంది మండపంలో స్వామి, అమ్మవార్ల మూర్తులను ఉంచారు. ఇప్పటి నుంచి జూన్ 30వ తేదీ వరకు స్వామి వారికి నిత్య కైంకర్యాలు, నిత్యారాధన, తికాలార్చనలు, అమ్మవారికి కుంకుమ పూజలు ఇక్కడే నిర్వహించనున్నారు.




